టీడీపీకి పయ్యావుల రాజీనామా..? త్వరలో వైసీపీలో చేరిక..?

-

అనంతపురం జిల్లా నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఒకరు. అయితే ఈయన త్వరలో వైకాపాలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించాక ఆ రాష్ట్రంలోని నేతలందరి చూపూ ఆ పార్టీ వైపే పడుతోంది. ఈ క్రమంలోనే టీడీపీతోపాటు పలు ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు వైసీపీలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించదలుచుకోలేదని, ఎవరైనా తమ పార్టీలోకి వస్తే పాత పార్టీతోపాటు ప్రజాప్రతినిధులైతే ఆ పదవులకు కూడా రాజీనామా చేశాకే వైసీపీలో చేరాలని చెబుతున్నారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయంపై సందిగ్ధంలో పడ్డారు. అయితే టీడీపీ నుంచి ఈసారి గెలిచిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాత్రం ఇందుకు సరేనని చెప్పి.. త్వరలో వైసీపీలో చేరేందుకు కూడా ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది.

అనంతపురం జిల్లా గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండేది. అయితే ఈ సారి మాత్రం ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఒకరు. అయితే ఈయన త్వరలో వైకాపాలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే నేడో, రోపో ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని కూడా తెలుస్తోంది.

అయితే ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ ఎప్పుడు నెగ్గినా రాష్ట్రంలో ఆ పార్టీ మాత్రం అధికారంలోకి రావడం లేదు. దీంతో ఈ సారి కూడా సరిగ్గా అలాగే జరిగింది. అయితే తాను గెలిస్తే పార్టీ అధికారంలోకి రాకపోవడం, ఓడిపోతే పార్టీ అధికారంలోకి వస్తుండడంతో.. విసిగిపోయిన పయ్యావుల కనీసం అధికారంలో ఉన్న పార్టీలోనైనా చేరితే ఆ మచ్చ నుంచి కొంత వరకైనా బయట పడవచ్చని ఆలోచిస్తున్నారట. అందుకనే ఆయన త్వరలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. అయితే వైసీపీలో చేరే ఎవరైనా తమ పదవికి రాజీనామా చేశాకే రావాలని జగన్ అన్న నేపథ్యంలో పయ్యావుల వైసీపీలో చేరికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ వైసీపీకి చెందిన కొందరు నేతలు మాత్రం పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిద్దామని జగన్ ఎదుట కొత్త ప్రతిపాదన పెట్టారట. మరి జగన్ చంద్రబాబు లాగే చేస్తారా.. లేదా నేతలచే రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకుంటారా..? అన్న వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి చూడక తప్పదు..!

Read more RELATED
Recommended to you

Latest news