ఇప్పుడు టాలీవుడ్‌లో ఏ హీరోని, ఏ దర్శకుడిని కదిలించినా ఒకే మాట పాన్ ఇండియా. బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ మేకింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఏ సినిమా మొదలుపెట్టినా హాలీవుడ్ టెక్నీషియన్ తప్పని సరి అనే ట్రెండ్ మొదలైంది. ఈగ, బాహుబలి చిత్రాల వీఎఫ్ ఎక్స్ కోసం రాజమౌళి హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని `సైరా` చిత్రానికి సురేందర్‌రెడ్డి ఏకంగా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌లనే దించేశాడు.
ఇప్పుడు మరోసారి హాలీవుడ్ టెక్నీషియన్‌లని తన కొత్త చిత్రం కోసం సురేందర్‌రెడ్డి సంప్రదిస్తురు. సురేందర్‌రెడ్డి ప్రస్తుతం అఖిల్ అక్కినేని తో ఓ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ని రూపందించబోతున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మంతో కలిసి సరెండర్ 2 సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్‌ని సురేందర్‌రెడ్డి దించుతున్నట్టు తెలిసింది.
స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఇందులోని స్టంట్స్ అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా వుండాలంటే అందుకు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ కావాల్సిందే అని సురేందర్‌రెడ్డి వారిని సంప్రదిస్తున్నారు. నిర్మాత కూడా బడ్జెట్ విషయంలో రాజీపడకపోవడంతో ఈ చిత్రాన్ని లావిష్‌గా స్టైలిష్ స్పై థ్రిల్లర్‌గా అంతర్జాతీయ ప్రమాణాలతో తెరపైకి తీసుకురాన్నట్టు తెలిసింది.