విశాఖలో తన థియేటర్ ను అమ్మేసిన సురేష్ బాబు.. అందుకేనా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కుటుంబాలలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి వారసుడు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా.. తన తండ్రి డి.రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డి.రామానాయుడు స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ మంచి విజయపథం వైపు దూసుకుపోతున్న సురేష్ బాబు ఇటీవల విశాఖపట్నంలో ఉన్న తన థియేటర్ ను అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ థియేటర్ ను అమ్మడానికి గల కారణం ఏమిటి? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇకపోతే కరోనా మహమ్మారి కారణంగా దేశంలో సినీ పరిశ్రమ పై కోలుకోలేని దెబ్బ పడింది. ఒక్కసారిగా థియేటర్లు మూతపడమే కాకుండా థియేటర్లు మూతపడడంతో ఓటీటీ లకు మంచి ఆదరణ పెరిగింది. ఇక ఈ క్రమంలోనే ఇంటిల్లిపాదీ ఇంటిలో కూర్చొని ఎంతో సంతోషంగా ఓ టీ టీ లలో సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు. ఇకపోతే యధావిధిగా కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకొని థియేటర్ లు రన్ అవుతున్నప్పటికీ థియేటర్లకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఒకవైపు సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో.. సామాన్యులకు కుటుంబంతో కలిసి సినిమా చూసే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. కొంతమంది నిర్మాతలు తమ థియేటర్లను అమ్మకానికి కూడా పెడుతున్నారు.Daggubati Suresh Babu Filmography | Biography of Daggubati Suresh Babu | Daggubati Suresh Babu | Indian Film History

సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు విశాఖ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి జ్యోతి థియేటర్ ను అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే కరోనా తర్వాత థియేటర్లకు ఆదరణ తగ్గడం వల్లే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి ఈయన తన థియేటర్ అమ్మడం చర్చనీ అంశంగా మారింది. ఈ విధంగా తన థియేటర్ అమ్మేసి ఆస్థానంలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టడం కోసమే పలువురు వ్యాపారులు ఈయన దగ్గర నుంచి థియేటర్ ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ థియేటర్ కు పెద్దగా ప్రేక్షకులు ఎవరు రాకపోవడం వల్లే థియేటర్ ను అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news