కొండ మీద ప్రపోస్ చేయాలనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు

-

ప్రేమించిన అమ్మాయికి ప్రపోస్ చేయడం కాస్త భిన్నంగా ఉండాలి అని భావిస్తూ ఉంటారు. కాని ఇది ఈ మధ్య కాలంలో కాస్త భిన్నంగా మారుతుంది అనే మాట వాస్తవం. తాజాగా ఒక ఘటన జరిగింది. కాస్త రొమాంటిక్ గా భిన్నంగా ఉండాలని భావించి… ఆస్ట్రియాలోని కారింథియాలో ఒక జంట ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మహిళ 650 అడుగుల కొండపై నుండి పడిపోయింది. కారింథియాలో 27 ఏళ్ల వ్యక్తి తన ప్రేయసికి ప్రపోస్ చేయాలనుకున్నాడు.

32 ఏళ్ల మహిళకు తన ప్రేమను చెప్పగా ఆమె కూడా అంగీకరించింది. ఇలా అంగీకరించిందో లేదో ఆమె ఫాల్కెర్ట్ పర్వతం నుండి జారి పడిపోయింది. ఈ సంఘటన డిసెంబర్ 27 న జరిగింది. ఈ జంట ఒక రోజు ముందు పర్వతం పైకి ట్రెక్కింగ్ చేశారు. ఆమె 650 అడుగుల కొండపై నుండి జారిపోయినప్పటికీ, మంచు మహిళ ప్రాణాలను కాపాడింది. ఇద్దరూ… మంచు కొండ మీద పడ్డారు.

ముందు ఆమె పడగా ఆమెను కాపాడటానికి అతను దూకాడు. ఇద్దరు మంచు కొండ మీద పడ్డారు. పడిపోయిన తర్వాత ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్ళారు అని, కొండ అంచు నుండి ఒక హెలికాప్టర్ ద్వారా రక్షించవలసి వచ్చింది అని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరూ చాలా అదృష్టవంతులు అని అధికారులు వెల్లడించారు. మంచు లేకపోతే వారి ప్రాణాలు పోయేవి అని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news