పెళ్ళి చేసుకోబోతున్నారా? మీ భాగస్వామి గురించి కలలు కంటున్నారా? ఐతే ఒక్క నిమిషం ఇది చదవండి.

-

అమ్మాయికి ఇరవై మూడేళ్ళు వచ్చాయంటే చాలు పెళ్ళి చేసేయాలని చూస్తుంటారు. కొంతమంది అయితే అక్కడి వరకు కూడా ఆగరు. ఇరవై ఏళ్ళు వస్తే చాలు పెళ్ళి చేయాలని సంబంధాలు చూడడం మొదలుపెడతారు. ఐతే కాస్త మూడేళ్ళు ఆగితే అమ్మాయిలో కానీ, అబ్బాయిల్లో గానీ ఒక పరిణతి వస్తుందని తెలుసుకోరు. తల్లిదండ్రుల విషయం వదిలేస్తే, పెళ్ళి చేసుకోబోయేవారు తమ జీవిత భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటారు. తమ భాగస్వామి ఇలా ఉండాలని, అలా ఉండాలని, పెళ్ళి తర్వాత జీవితం ఆహా అన్న రీతిలో ఉంటుందని ఊహించుకుంటారు.

అలా ఊహించుకోవడం తప్పేమీ కానప్పటికీ, వాస్తవం ఏంటన్నది కూడా గుర్తించాలి. ప్రస్తుత జెనరేషన్ లో ఒకరితో ఒకరు కలిసి ఉండడం కష్టమైపోతుంది. స్వతంత్ర భావాలు పెరగడంతో ఆలోచనలు మారిపోయాయి. దానివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందువల్ల పెళ్ళి చేసుకోబోయే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మీరు పెళ్ళి చేసుకోబోయే భాగస్వామి గురించి మీకేమీ తెలియదు. ఒకవేళ ఎంతో కొంత తెలిసినా అదే పూర్తిగా నిజం కాదు. ప్రేమించిన వారు కూడా ఆ తర్వాత మారిపోయావు అని చెప్పడానికి కారణం అదే. అందుకే మీ భాగస్వామిపై అంచనాలు పెట్టుకోవద్దు.

చాలా మంది ఒంటరిగా బ్రతకలేక పెళ్ళి చేసుకుంటారు, సమాజం కోసం ప్రేమగా ఉన్నామని చెప్పుకుంటారు. కాబట్టి, పెళ్ళిలో ప్రేమ ఉంటుందన్న గ్యారంటీ లేదు.

మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవాలని అస్సలు అనుకోవద్దు. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

భాగస్వామి చెప్పినవన్నీ నిజం అని అనుకోవద్దు. చెప్పినవన్నీ నిజమని నమ్మేస్తే, ఆ మాటల్లో నుండే భాగస్వామిని చూస్తారు.

మీకు మాత్రమే తెలిసిన సీక్రెట్స్ ని పంచుకోవద్దు. భవిష్యత్తులో అదే మీ పాలిట శాపంగా మారే అవకాశం ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news