ఓటీటీలో రిలీజ్‌ కానున్న సూర్య ”జై భీమ్‌”

-

తమిళ నాట స్టార్ స్టేటస్ ఉన్న హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఉన్న ఫాలోయింగ్‌ ను.. తెలుగులోనూ సూర్య సంపాదించుకున్నాడు. అయితే.. ఇటీవలే తన బర్త్‌ డే సందర్భంగా ఓ గిఫ్ట్‌ ఇచ్చాడు హీరో సూర్య. తన కెరీర్‌లో 39 వ సినిమా ”జై భీమ్‌” టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సూర్య స్వయంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది.

అయితే… ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్‌ వచ్చింది. జై భీమ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ లో నవంబర్‌ మాసంలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది జై భీమ్‌ చిత్ర బృందం. సామాజిక మరియు రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పక ఆకట్టుకుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇక చూడాలి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version