సుశాంత్ రాజపుత్ కాదు, రాజపుత్ లు ఉరివేసుకోరు: ఎమ్మెల్యే

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు విచారణ జరుగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ కేసు కూడా విచారిస్తున్నారు. జూన్ 14 న సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసుని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ కి చెందిన ఎమ్మెల్యే ఒకరు సుశాంత్ సింగ్ పై కీలక వ్యాఖ్య్ చేసారు.RJD MLA Arun Yadav

సుశాంత్ సింగ్ అసలు రాజపుత్ కాదన్నారు ఆయన. సుశాంత్ సింగ్ ‘రాజ్‌పుత్ కాదు’ అని ఆర్జేడీ ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ అన్నారు. ‘రాజ్ పుత్‌ లు మహారాణా ప్రతాప్ వారసులు వారు ఉరి వేసుకుని తమను తాము చంపుకోలేరు అని అన్నారు అరుణ్ యాదవ్. ఈ కేసులో కీలక నిందితురాలిగా రియా చక్రవర్తిని అనుమానిస్తున్నారు.