రియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుశాంత్ సోదరి!

-

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు, సీబీఐ అధికారులు, సుశాంత్ కుటుంబ సభ్యులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్త్రవర్తిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్ ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

రియా చక్రవర్తి ఇంటర్వ్యూలో సుశాంత్ కు అతని సోదరి, తండ్రితో విభేదాలు ఉన్నాయని… వాళ్లు తరచూ గొడవ పడేవాళ్లని… కుటుంబ సభ్యుల ప్రవర్తన నచ్చకపోవడం వల్ల సుశాంత్ కుటుంబానికి దూరంగా ఉండేవాడని ఆమె పేర్కొంది. అయితే రియా చక్రవర్తి చేసిన ఆరోపణల గురించి సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ స్పందించింది. సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించిన శ్వేత ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేసింది.

శ్వేతా సింగ్ విమాన ప్రయాణ టికెట్ ను షేర్ చేసి తనకు సుశాంత్ పై ప్రేమ లేకపోతే ఈ సంవత్సరం జనవరి నెలలో అమెరికా నుండి ఇండియాకు ఎందుకు వస్తానని… పిల్లలను, బిజినెస్ ను వదిలి సుశాంత్ చండీగఢ్ వెళుతున్నాడనే కారణంతో ఇండియాను వచ్చానని పేర్కొంది. ఆ సమయంలో సుశాంత్ షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల తనను కలవడం సాధ్యపడలేదని… సుశాంత్ చనిపోయే రోజు వరకు ప్రతి విషయంలోనూ సుశాంత్ కు కుటుంబం అండగా నిలిచిందని తెలిపింది. శ్వేతా సింగ్ వ్యాఖ్యలపై రియా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news