రిపబ్లిక్ టీవీ తో పాటు దాని చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు, చిత్రనిర్మాత సందీప్ సింగ్ 200 కోట్లకు పరువు నష్టం దావా వేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన లీగల్ నోటీసుల్ని సందీప్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 15 రోజుల్లో తన నోటీసులకు బదులు చెప్పాలని లేదంటే అర్నబ్ గోస్వామితో పాటు రిపబ్లిక్ టీవి పై క్రిమినల్ చర్యలు తసుకుంటానని హెచ్చరించారు.
అర్నబ్‌తో పాటు రిపబ్లిక్ టీవి సుశాంత్ అనుమానాస్పద మృతిలో తనని కీలక కుట్రదారుగా చిత్రీకరించిందని, ఇందుకు బేశరతుగా అర్నబ్ తనకు క్షమాపణలు చెప్పాలని అంతే కాకుండా తన పరువుకి భంగం కలిగించారు కాబట్టి తనకు 200 కోట్లు నష్టపరిహారం కింద చెల్లించాలని సందీప్ సింగ్ డిమాండ్ చేశాడు. సందీప్ నుంచి ఊహించిన ఎదురుదాడి ప్రారంభం కావడంతో అర్నబ్ అండ్ కో షాక్ కు గురైనట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తనని డ్రగ్ పెడ్లర్‌గా అర్నబ్ ఈ కేసులో చిత్రీకరించాడని సందీప్ సింగ్ మండిపడ్డారు.
తాజా పరిణామాల నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతాసింగ్‌కీర్తి బుధవారం తన ట్విట్టర్ అండ్ ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలని డీయాక్టివేట్ చేసింది. సుశాంత్ మృతి చెంది నాలుగు నెలలవుతున్న నేపథ్యంలో శ్వేతా తన సోషల్ మీడియా అకౌంట్‌లని డీయాక్టివేట్ చేయడం నెటిజన్స్‌లో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. అయితే శ్వేత మాత్రం తన అకౌంట్‌లని హ్యాక్ చేస్తారన్న అనుమానం వల్లే వాటిని తను డీయాక్టీవేట్ చేశానని చెబుతోంది.