సుప్రీం కోర్టు చారిత్రాత్మ‌క తీర్పు.. మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల త‌ల్లిదండ్రుల ఇండ్ల‌లోనూ ఉండ‌వ‌చ్చు..

-

భార‌త అత్యున్న‌త న్యాయస్థానం చారిత్రాత్మ‌క తీర్పు చెప్పింది. గృహ హింస చ‌ట్టం ప్ర‌కారం కోడ‌లు త‌న అత్త మామ ఇంట్లోనూ నివాసం ఉండ‌వ‌చ్చ‌ని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేర‌కు ముగ్గురు సభ్యుల‌తో కూడిన జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తీర్పు ఇచ్చింది. త‌రుణ్ బాత్రా కేసులో ఇద్ద‌రు జ‌డ్జిలు ఇచ్చిన తీర్పును కోర్టు మార్చి పై విధంగా తీర్పు చెప్పింది.

supreme court sensational judgement

ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌కు చెందిన త‌ల్లిదండ్రుల ఇంట్లో నివాసం ఉండే హ‌క్కు ఆమెకు లేద‌ని గ‌తంలో ఇద్ద‌రు జ‌డ్జిల‌తో కూడిన ధ‌ర్మాసనం త‌రుణ్ బాత్రా కేసులో తీర్పు ఇవ్వ‌గా, దాన్ని సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం వ్య‌తిరేకింది. ఈ క్ర‌మంలో సుప్రీం తాజా తీర్పుతో మ‌హిళ త‌న భ‌ర్త త‌ల్లిదండ్రుల ఇండ్ల‌లోనూ ఉండవ‌చ్చు. అందుకు సుప్రీం కోర్టు అనుమ‌తినిస్తుంది.

కాగా స‌ద‌రు తీర్పును వెల్ల‌డించే క్ర‌మంలో సుప్రీం ధ‌ర్మాస‌నం 6-7 ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు కూడా చెప్పింది. త‌ల్లిదండ్రుల ఆస్తుల‌ను పంచుకునే హ‌క్కు వ్య‌క్తికి ఎలాగైతే ఉంటుందో అత‌ని భార్యకు అత‌ని త‌ల్లిదండ్రుల ఇంట్లో ఉండే హక్కు కూడా ఉంటుంద‌ని కోర్టు వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news