మోదీని పొగిడిన ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు..!

-

ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తిన డీఎంకే ఎమ్మెల్యే కుకా సెల్వంపై సస్పెన్షన్​ వేటు వేసింది పార్టీ అధిష్ఠానం. ఆయనను పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

సెల్వం బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో మంగళవారం పర్యటించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రామమందిరం నిర్మాణాన్ని సాధ్యమయ్యేలా చేశారని కొనియాడారు.అయితే తన నియోజకవర్గానికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని రైల్వేమంత్రి పీయూష్ గోయల్​ను కలిసేందుకే ఢిల్లీ వెళ్లానని వివరణ ఇచ్చారు సెల్వం.తౌసండ్ లైట్ల్​ నియోజకవర్గానికి సెల్వం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సస్పెన్షన్​కు ముందు వరకు డీఎంకే ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా, కార్యనిర్వాహక సభ్యునిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news