‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా యంగ్ హీరో

-

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం. ఓ అమ్మాయికి మరియు ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు అలాగే జరిగే సంఘటనలు ఇవన్నీ స్వాతిముత్యం సినిమాలో చూపించనున్నారు.

ప్రముఖచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అయితే అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పకళా వేదికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు… యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి రానున్నట్లు తాజాగా స్వాతి ముత్యం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా అవ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news