నానీ “దసరా” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ !

-

టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విభిన్నమైన పాత్రలు, స్టోరీలు చేస్తూ అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. నాని వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఇటీవల కాలంలో సక్సెస్ అనేది అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుతం హీరోగా నాని 29వ సినిమాకు రెడీ అవుతున్నారు. “దసరా” అనే టైటిల్ తో నాని 29వ మూవీ తెరకెక్కబోతోంది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక గా నటిస్తోంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర బృందం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ” ధూమ్ దాం దోస్తాన్” పాటను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాని ఉరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news