ఆమె విడాకులు తీసుకోవడం వెనక చాలా పెద్ద కథే ఉంది .. చెయ్యెత్తి దండం పెట్టాలి

-

ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ స్వాతి మలివాల్‌ అంటే దేశ రాజ‌ధానిలో తెలియ‌ని వాళ్లు ఎవరు ఉండ‌రు. యాక్టివిస్ట్‌గా ఆమె మంచి గుర్తింపు పొందారు. దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకురాలిగా ఆమె రాణించడం జరిగింది. సమాజంలో సమస్యలపై రాజీలేని పోరాటం మరియు మొండితనం కలిగిన స్వాతి మ‌లివార్ దేశంలోనే అత్యంత చిన్న‌ వయసులో మహిళా కమిషన్‌ బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. Image result for swati maliwal

గతంలో స్వాతి మలివాల్‌ మరియు ఆమె భర్త నవీన్ ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నాయకులు గా రాణించడం జరిగింది. మహిళల భద్రత విషయంలో మరియు దేశానికి ఇంకా ఏదైనా చెయ్యాలి అన్న దాని విషయంలో  స్వాతి మ‌లివార్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటిది ఇటీవల తన భర్తతో స్వాతి విడాకులు తీసుకున్నారు. ‘మీటూ’ ఉద్యమ సమయంలో స్వాతి భర్త నవీన్ జైహింద్ .. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది.

 

అప్పటి నుంచి వాళ్లిద్ద‌ని మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. అది కాస్త విడాకులకు దారి తీసింది. వారి విడాకుల వ్య‌వ‌హారం బుధ‌వారానికి ఒక కొలిక్కి వ‌చ్చింది. చ‌ట్ట‌బ‌ద్ధంగా వారిద్ద‌రూ విరిగిపోవడం జరిగింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది లేడీ నెటిజన్లు ఆమె చేసిన పనికి చెయ్యెత్తి దండం పెడుతున్నారు. అన్నా హజారే నేతృత్వంలో ఉదృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఈ జంట కి మంచి పేరు వచ్చింది. కాగా ఆ సమయంలో ప్రేమలో పడిన వీళ్లిద్దరు తర్వాత పెళ్లి చేసుకొని ఇటీవల విడిపోయి విడాకులు తీసుకోవటంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో స్వాతి మలివాల్‌ విడాకులు తీసుకోవడం వెనుక ఇంత కథ ఉందా..? అంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news