ర‌ష్మిక ఫ్యామిలీ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.. ఎందుకో తెలుసా..?

-

కొంతమంది హీరోయిన్లకి మొదటి సినిమాతోనే మంచి పేరు వస్తుంది. వారు ఎలా ఉన్న నటనకు ఫిదా అయిపోయి అభిమానులు వారికీ బ్రహ్మరథం పట్టేస్తారు. అంతటి అదృష్టాన్ని అందుకున్న హీరోయిన్‌ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి విజయాలను అందుకున్న ఈమె.. అనతి కాలంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈమె ఫ్యామిలీ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రాజ వంశీకునిగా ఈ చిత్రంలో తలపై పాగా, నడుమున కత్తి పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు చూశారా? అతను టాలీవుడ్ బ్యూటీ రష్మిక తండ్రి మదన్ మందాన.

రష్మికకు ఎడమవైపున ఉన్నది ఆమె తల్లి సుమన్ మందాన. ఇక రష్మిక చంకనెక్కి దర్జాగా కూర్చుని ఉన్నది ఎవరో తెలుసా? రష్మిక చెల్లి శిమన్. ఏదో సినిమా షూటింగ్ స్టిల్ మాదిరిగా కనిపిస్తున్న ఈ స్టిల్ ను రష్మిక ఫ్యాన్స్ కు చూపింది. ఆమె చెల్లి శిమన్ కు ప్ర‌స్తుతం బహుశా ఆరేడు సంవత్సరాలు ఉండవచ్చు. ఇక ఈ లేటెస్ట్ ఫోటోను రష్మిక, తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైరల్ కాగా, ఫ్యాన్స్ నుంచి తెగ కామెంట్లు వచ్చేస్తున్నాయి. 23 సంవత్సరాల వయసున్న రష్మికకు ఇంత చిన్న చెల్లా? అన్నది వాటిల్లో హైలైట్ అవ్వ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news