మొక్కజొన్నల్లో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. స్వీట్ కార్న్ లేదా దేశవాళీ మొక్కజొన్న. ఇవి రెండూ మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. స్వీట్ కార్న్ అయితే మార్కెట్‌లో మనకు ఎప్పుడు కావాలన్నా దొరుకుతుంది. కానీ దేశవాళీ మొక్కజొన్న అయితే కేవలం సీజన్లలోనే లభిస్తుంది. రెండూ భిన్న రకాల రుచిని కలిగి ఉంటాయి. అయితే రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనది ? అంటే..
స్వీట్ కార్న్ మన దేశానికి చెందిన వెరైటీ కాదు. దీన్ని రుచి కోసమే ప్రధానంగా పండిస్తున్నారు. ఇందులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు దాదాపుగా తక్కువే. చీడపీడలను తట్టుకునేందుకు వీటిపై క్రిమి సంహారక మందులను ఎక్కువగా చల్లుతారు. పైగా స్వీట్‌కార్న్ హైబ్రిడ్ రకానికి చెందినది. ఫైబర్ తక్కువగా ఉంటుంది.
ఇక దేశవాళీ మొక్కజొన్నను పండించేందుకు తక్కువ వనరులు అవసరం అవుతాయి. పైగా చీడపీడలను తట్టుకుని తక్కువ ఎరువులతోనే పెరుగుతాయి. ఈ మొక్కజొన్నలో పిండి పదార్థాలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. కానీ స్వీట్ కార్న్ అలా కాదు. వాటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
కనుక ఏ రకంగా చూసినా స్వీట్ కార్న్ మనకు మంచిది కాదు. దేశవాళీ మొక్కజొన్నను తినడమే శ్రేయస్కరం. దీంతో పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.