హైదరాబాద్‌ వాసులకు షాక్‌.. వచ్చే నెల 5 నుంచి స్విగ్గీ డెలివరీ బాయిస్‌ సమ్మె !

-

హైదరాబాద్‌ ఆహర ప్రియులకు సిగ్గీ డెలివరీ బాయిస్‌ ఊహించని షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ పరిధిలో పని చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ సమ్మెకు సిద్దమౌవుతున్నారు. కనీస ఛార్జీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలను డిమాండ్‌ చేస్తూ.. యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చారు. తమ డిమాండ్ల పై స్పందన రాకుంటే… డిసెంబర్‌ 5 వ తేదీ నుంచి సమ్మె చేస్తామని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ ఫార్మ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

స్విగ్గీ సీఈవో శ్రీ హర్ష మజేటీ, హదరాబాద్‌ మేనేజర్‌ కు ఈ మేరకు లేఖలు పంపామని చెప్పారు. ”స్విగ్గీ బాయ్స్‌ కు కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు. పెట్రోల్‌ ధరలు పెరిగినా… వారికి చెల్లించాల్సిన చార్జీల్లో మార్పులేదు. కస్టమర్‌ దగ్గరి నుంచి తిరిగి హోటల్‌ రావడానికి అయ్యే ఖర్చు జమ కట్టడం లేదు” అని వివరించారు. పలు డిమాండ్లను యాజమాన్యం ముందుంచామని.. సోమవారం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి లో 10 వేల మంది డెలివరీ బాయ్స్‌ సమ్మెలో పాల్గొంటారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version