ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. బంగాళాఖాతంలో మరో తుఫాన్.. దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ బీకర తుఫాన్ ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఈ తుఫాను కారణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. అటు తమిళనాడుకు కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.