ధోని విఫలం.. చూస్తే జాలేస్తుంది..!

-

ప్రతి ఐపీఎల్ సీజన్ లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగి వరుస విజయాలను అందుకుంటు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్థానం ఎంతో విజయవంతంగా సాగింది. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో మాత్రం ధోనీసేన ఎంతో పేలవంగా ప్రదర్శన చేస్తూ విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ధోనీ కూడా పాత ఫామ్లోకి రాలేకపోతున్నాడు. దీంతో ఎంతో మంది మాజీ లు స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు.

dhoni

ఇటీవలే ధోనీ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో స్పందించిన భారత మాజీ ఆటగాడు సయ్యద్ కిర్మాణి… ధోని కి మద్దతుగా నిలిచాడు.ప్రతి ఆటగాడి విషయంలో ఎత్తుపల్లాలు ఉంటాయి అంటూ తెలిపిన సయ్యద్ కిర్మాణి… కాలాన్నిబట్టి పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోని ని విమర్శించే వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది అంటూ తెలిపిన కిర్మానీ… ధోని ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అనే విషయం అందరికీ తెలుసు అంటూ గుర్తు చేశారు. చాలా సమయం పాటు క్రికెట్ కు దూరంగా ఉండడం వల్ల ప్రస్తుతం ఆ ప్రభావం ధోనిపై ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సయ్యద్ కిర్మాణి.

Read more RELATED
Recommended to you

Latest news