మాజీ డిప్యూటీ సీఎంపై మాజీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్నే రేపేలా కనిపిస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎంపై మాజీ డిప్యూటీ సీఎం అంతలా కామెంట్ చేయాల్సిన అవసరం లేకున్నా కామెంట్ చేసి కెలికాడు. దీంతో ఇది ఇద్దరు నేతల నడుమ రాజకీయ పోరాటానికి తెరలేపుతుబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ మాజీ డిప్యూటీ సీఎం దుందుడుగా, అనాలోచితంగా అనవసరంగా చేసిన కామెంట్‌తో తెలంగాణ వ్యాప్తంగా కుల ఘర్షణలకు దారి తీసేలా ఉన్నాయి. ఇప్పుడు ఇదే వ్యాఖ్యాలు తెలంగాణ అధికార పార్టీకి ఉచ్చులా మారబోతున్నాయా అనే చర్చ కూడా సాగుతుంది.
ఇంతకు ఇద్దరు మాజీ డిప్యూటీలు ఎవరో కాదు ఒకరు కడియం శ్రీహరి, మరొకరు డాక్టర్ టి.రాజయ్య. ఇద్దరిది ఒకే నియోజకవర్గం. ఇద్దరు దళిత ప్రజాప్రతినిధులే. ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరిది ఒకే పార్టీ. అయితే ఇద్దరు ఒకే నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నవారే కావడం గమనర్హం. ఇంతకు ఏ మాజీ డిప్యూటీ సీఎం ఏ మాజీ డిప్యూటీ సీఎంపై కామెంట్ చేశారు అనుకుంటున్నారా…? మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై డాక్టర్ రాజయ్య హాట్ కామెంట్ చేశారు. మాదిగ సంఘాలు, ప్రజాప్రతినిధుల సమావేశంలో రాజయ్య పాల్గొన్నారు. ఈసమావేశంలో తాను కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యాలు చేసి కులాల పోరాటానికి భీజం వేశారు.
దళితులకు కేసీఆర్ మూడున్నర ఎకరాల భూమి ఇవ్వడం సాధ్యం కాదని, అసలు కేసీఆర్ దళితులకు భూములే ఇస్తానని మాట ఇవ్వలేదని, కేవలం వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకే భూములు ఇస్తానని కేసీఆర్ మాటిచ్చారని రాజయ్య వ్యాఖ్యానించారు. అయితే భూముల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో భూములు ఇవ్వడం వీలు కాదు కనుక ప్రతి కుటుంబానికి రూ.30లక్షలు ఇచ్చేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని, అందుకు కేసీఆర్‌తో నేను మాట్లాడుతానని అన్నారు.
అయితే ఇక్కడే వివాదస్పద వ్యాఖ్యాలకు నాంది పలికారు రాజయ్య. దళితుల్లో ఎక్కువగా నష్టపోయింది మాదిగ కులస్తులని, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం వారే పోరాటం చేసుకోవాలని రాజయ్య కామెంట్ చేశారు. మరో అడుగు ముందుకేసీన రాజయ్య మాదిగ ఉప కులాలకు చెందిన కడియం శ్రీహరిని ఇందులోకి లాగారు. మాదిగ ఉపకులానికి చెందిన కడియం శ్రీహరి 18 ఏళ్ళు మంత్రిగా పనిచేశాడని వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి 18 ఏళ్ళు మంత్రిగా పనిచేసి మాదిగ ఉపకులాలకు ఏలాంటి న్యాయం చేయలేదని పరోక్షంగా విమర్శించారు.
మాదిగ బిడ్డను కనుకు నేను కేవలం మాదిగ కులానికే పని చేస్తానని, మాదిగ ఉప కులాలకు పని చేయననే భావనతోనే రాజయ్య వ్యాఖ్యానించారని అర్థమవుతుంది. సోదరుల్లా కలిసి మెలిసి ఉంటున్న మాదిగ, మాదిగ ఉపకులాల నడుమ రాజయ్య చిచ్చు రాజేసినట్లైంది. కడియం శ్రీహరిని టార్గెట్ చేసి, ఎక్కువ శాతం ఉన్న మాదిగలను తనవైపుకు లాక్కుని, మాదిగలు కడియం శ్రీహరికి మద్దతు ఇవ్వకుండా చేసే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాఖ్యాలు అనిపిస్తుంది.
కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన కామెంట్లు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. అయితే కడియం శ్రీహరిని కావాలనే రాజయ్య గోకుతున్నాడని, కడియం శ్రీహరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక తెలంగాణలో మాదిగ, మాదిగ ఉప కులాల నడుమ కొట్లాట పెట్టేందుకు రాజయ్య పన్నాగం పన్నుతున్నాడని, ఇది అధికార టీ ఆర్ ఎస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహరంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే.