T20 : టాప్ ర్యాంక్ ను పదిలం చేసుకున్న సూర్య కుమార్ యాదవ్

-

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లు ముగిసాయి .బుధవారం (జూన్ 19) నుంచి సూపర్ 8 మ్యాచ్ లు మొదలు కానున్నాయి.సూపర్ 8 మ్యాచ్ లకు ముందు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను రిలీజ్ చేసింది. టీమిండియా టీ20 బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ 837 రేటింగ్ పాయింట్లతో తన టాప్ ర్యాంక్ ను పదిలం చేసుకున్నాడు. 771 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ ఓపెనర్ పిల్ సాల్ట్ రెండో స్థానంలో , బాబర్ ఆజం,మహ్మద్ రిజ్వాన్,ట్రావిస్ హెడ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

బౌలింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ మొదటి స్థానంలో ,వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ రెండో స్థానంలో నిలిచాడ. ఆల్ రౌండర్లలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు . మహమ్మద్ నబీ రెండో స్థానములో ,భారత ఆటగాడు హార్దిక్ పాండ్య 7 వ స్థానంలో చోటు సంపాదించాడు.

 

 

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్:

 

1) సూర్యకుమార్ యాదవ్ (837)

2) ఫిల్ సాల్ట్ (771)

3) బాబర్ ఆజం (755)

4) మహ్మద్ రిజ్వాన్ (746)

5)ట్రావిస్ హెడ్ (742)

6)జోస్ బట్లర్ (710)

Read more RELATED
Recommended to you

Latest news