రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము అట్టహాసంగా నిర్వహించాలి… సిఎస్ ఆదేశం

-

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కావడంతో అట్టహాసంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. జూన్ 2న జరిపే ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ శాంతకుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు.పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను కోరారు.

ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సీఎస్ శాంతకుమారి పోలీసు శాఖను ఆదేశించారు.నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news