T20 World Cup: ఫ్రీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్.. ఎందులో అంటే..?

-

టి20 ప్రపంచ కప్ ఆటకు సమయం ఆసన్నమైంది. బుధవారం(జూన్ 05) గ్రూప్‌ `ఎ` లో భాగంగా టీమిండియా ఐర్లాండ్‌తో తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్‌లు జట్టు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1తెలుగుతో పాటు కన్నడ, భోజ్‌పూర్, మళయాళం, తమిళ,హిందీ తదితర భాషల ఛానెళ్లలో లైవ్ వీక్షించవచ్చు. అంతేకాదు ప్రపంచ కప్‌లో ఇండియా జట్టు తలపడే మ్యాచ్‌లు డీడీ స్పోర్ట్స్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.అంతేకాకుండా డిస్నీ + హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు. మొబైల్ వినియోగదారులు హాట్‌స్టార్‌ యాప్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లన్ని ఫ్రీగా చూసే వీలుంది.రోహిత్ సేన అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రూపంలో బ్యాటింగ్.. పేసర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లలో కుల్దీప్, జడేజా కీలకం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news