Shocking : పదో తరగతి పరీక్షలకు పూటుగా మద్యం తాగొచ్చిన టీచర్‌..

-

విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే తప్పటడులు వేశాడు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఓ టీచర్‌ తాన భవిష్యత్తునే అంధకారం చేసుకున్నాడు. పదో తరగతి పరీక్షలకు మద్యం సేవించి వచ్చి సస్పెండ్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హుజురాబాద్ లోని రాంపూర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఆముల రవికుమార్ డ్యూటీలో ఉండగా మొదట ఎగ్జామ్ కి వచ్చిన విద్యార్థులకు అనుమానం వచ్చింది. తన ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా అనిపించింది. ఇదే విషయంపై ఇన్స్పెక్షన్ విధులకు వచ్చిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావుకి కూడా అనుమానం వచ్చింది. దీంతో సదరు టీచర్ని ప్రశ్నించగా గుప్పున వాసన వచ్చింది.

ఇక వెంటనే స్థానిక పోలీసులను పిలిపించి సదరు టీచర్ కి ఎగ్జామ్స్ సెంటర్ లోనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. మామూలుగా 30 ఉండాల్సిన మద్యం స్థాయిలు ఏకంగా 112 చూపించాయి. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించిన ముఖ్యమైన ఎగ్జామ్స్ జరుగుతుంటే సదరు టీచర్ మాత్రం నిర్లక్ష్యంగా మందు తాగి మరి ఎగ్జామ్ కి అటెండ్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్య అధికారులు వెంటనే అతణ్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version