బ్రేకింగ్ : తాజ్ మహల్ లో బాంబు కలకలం.. మూసివేత !

తాజ్ మహల్‌ వద్ద బాంబు కలకలం రేగింది. తాజ్ మహల్ లో బాంబు పెట్టినట్టు ఒక వ్యక్తి  ఉత్తర ప్రదేశ్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌కు ఈ ఉదయం వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని పర్యాటకులకు ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు. వెంటనే దానిని మూయిన్హ్కారు. దీంతో భయాందోళనలో టూరిస్టులు, స్థానికులు ఉన్నట్లు చెబుతున్నారు. తాజ్ మహల్ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు బాంబ్ స్క్వాడ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ బాంబు బెదిరింపు నేపథ్యంలో అధికారులు ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున తనిఖీల ద్వారా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తాజ్‌మహల్ లోపల ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అంటున్నారు. అయినా సరే ముందస్తు జాగ్రత్తగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. యూపీలోని ఫిరోజాబాద్ ఏరియా నుంచి ఈ కాల్ వచ్చినట్లు గుర్తించారు. సైనిక నియామకంలో తాను వివక్షకు గురయ్యానని.. అందుకే ఈ ఫోన్ చేసినట్లు సదరు వ్యక్తి చెప్పినట్టు ఎస్పీ  వెల్లడించారు.