క్రెడిట్ లైన్ లోన్ ఇలా తీసుకోండి… పర్సనల్ లోన్ వర్సెస్ క్రెడిట్ లైన్ లోన్…?

-

బ్యాంకు లో లోను రావాలి అంటే ఒకరకంగా కొన్ని రోజుల క్రితం నరకం అనే చెప్పాలి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొన్ని యాప్స్ నిమిషాల్లో లోన్ లు ఇస్తున్నాయి. మొబైల్ యాప్ ఉంటే చాలు మీకు నిమిషాల్లో లోన్ వచ్చేస్తుంది.. క్రెడిట్ లైన్ అని పిలిచే ఈ మొబైల్ యాప్ లోన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. క్రెడిట్ లైన్ లోన్ అనేది ప్రీ అప్రూవ్ద్ లోన్ లాంటిదే.

మీకు రూ.5 లక్షలు బ్యాంకు లోన్ క్రెడిట్ లోన్ కింద ఇచ్చింది. కాని అందులో మీరు కేవలం 3 లక్షలే వాడుకున్నారు. ఆ మూడు లక్షలకు వడ్డీ కడితే చాలు. వాడుకోకుండా ఉండే డబ్బులకు లోన్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆ డబ్బులు వాడుకుంటే వడ్డీ కట్టవచ్చు. సులభంగా చెప్పాలి అంటే వంద రూపాయలు వాడుకుంటే ఆ వందకు మాత్రమే వడ్డీ కట్టుకోవాలి. వ్యక్తిగత రుణానికి దీనికి చాలా తేడాలు ఉంటాయి.

వ్యక్తిగత లోన్ లో చాలా అర్హతలు చూసి రుణాలు ఇస్తారు. ఆ డబ్బులను మొత్తాన్ని మీ ఖాతాలో వేస్తుంది కాబట్టి వాడినా వాడకపోయినా కట్టాలి. క్రెడిట్ లైన్ లోన్ లో అవసరం ఉన్న మేరకు మాత్రమే ఋణం ఎన్ని సార్లు అయినా తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ కావాలి అంటే ఒక పది సార్లు బ్యాంకు లకు తిరగాల్సి ఉంటుంది. కనీసం రెండు రోజులు మరీ చూస్తే పది రోజులు అయినా పడుతుంది.

కాని ఈ లోన్ లో అలాంటి ఇబ్బంది ఉండదు. 24 గంటల్లో ఇస్తారు. రెండు నుంచి 36 నెలల్లో ఇచ్చేస్తారు. ఈ లోన్ ని ఫైనాన్స్ సంస్థలు చాలానే ఆఫర్ చేస్తున్నాయి. పిల్లల చదువులు పెళ్లి ఖర్చులు వంటి వాటికి ఎంత అవసరం ఉంటుందో స్పష్టంగా తెలియదు కాబట్టి క్రెడిట్ లైన్ లోన్ చాలా మంచిది. MoneyTap, LoanTap, LazyPay, ZestMoney లాంటి పలు సంస్థలు ఈ లోన్స్ ఇస్తున్నాయి.

సిటీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ లాంటి బ్యాంక్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఈ లోన్స్ ని ఇవ్వడానికి సిద్దమవుతున్నాయి. మనీట్యాప్, లోన్‌ట్యాప్, లేజీపే, జెస్ట్ మనీ లాంటి ఫిన్‌టెక్ కంపెనీలు గరిష్టంగా ఖాతాదారులకు రూ.5 లక్షల వరకు క్రెడిట్ లైన్ లోన్స్ ఇస్తున్నాయి. సిటీ బ్యాంకు అయితే ఏకంగా 25 లక్షల వరకు ఇస్తుంది. గరిష్టంగా లోన్ ఎంత ఇవ్వాలన్నది ఫిన్‌టెక్ కంపెనీలు, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఆధారపడుతుంది.

లోన్ కావాలి అనుకుంటే మొబైల్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. MoneyTap, LoanTap, LazyPay, ZestMoney లాంటి యాప్స్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని.. మీ పేరు, వయస్సు, అడ్రస్, పాన్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. మీ ఆదాయం ఆధారంగా లోన్ ఇస్తారు. అప్రూవ్ అయితే మీకు మొబైల్ యాప్ తో పాటుగా మెయిల్ కి వస్తుంది. మీ వద్ద పత్రాలు తీసుకుని సంస్థ ప్రతినిధి మిమ్మల్ని కలుస్తారు.

ప్రక్రియ కేవలం 24 గంటల్లో పూర్తవుతుంది. మీకు రూ.5 లక్షల లోన్ అప్రూవ్ చేసినా మీరు రూ.3,000 కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. రుణం గడువులోగా చెల్లించకపోతే మాత్రం జరిమానా పడుతుంది. పలు రకాల చార్జీలను తెలుసుకోవాలి. లేట్ అయితే ఎంత ఓవర్ డ్యూ ఎంత అనేవి తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news