సాధారణంగా వ్యక్తిగత రుణాలు తీసుకునే ఎవరైనా సరే.. రుణం తీసుకునేముందు వడ్డీ ఎంత చెల్లించాలి ? అనే విషయాన్ని పరిశీలిస్తారు. తక్కువ వడ్డీలను అందించే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వద్దే రుణం తీసుకుంటారు. మరోవైపు ఇతర చార్జిలు కూడా తక్కువగా ఉండే విధంగా చూసుకుని మరీ అన్నివిధాలుగా అనుకూలంగా ఉండేట్లు వ్యక్తిగత రుణాలను తీసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశంలో ఏయే బ్యాంకులు వ్యక్తిగత రుణాలకు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. ఆ బ్యాంకు వారు రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే 8.90 శాతం వరకు వడ్డీని అందిస్తున్నారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.95 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 8.95 శాతానికే పర్సనల్ లోన్‌ను ఇస్తోంది.
ఇక ఇండియన్ బ్యాంక్ 9.05 వడ్డీ రేటుకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9.55 శాతానికి పర్సనల్ లోన్లు ఇస్తున్నాయి. అలాగే ఎస్‌బీఐ 9.60 వడ్డీ రేటుకు రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్ ఇస్తోంది. అలాగే యూకో బ్యాంక్ 10.05 శాతానికి, బ్యాంక్ ఆఫ్ బరోడా 10.10, ఫెడరల్ బ్యాంక్ 10.49, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 10.75 వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాలను అందజేస్తున్నాయి. రూ.5 లక్షల వరకు రుణం పొందితే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అయితే ముందు ఇచ్చిన వడ్డీ రేట్లు వినియోగదారులు లోన్ తీసుకునే సమయానికి మారిపోవచ్చు కూడా. కనుక ఒకసారి ముందుగానే ఎంక్వయిరీ చేసుకోవడం మంచిది.
* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.90 శాతం వడ్డీ
* పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 8.95
* సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.95
* ఇండియన్ బ్యాంక్ – 9.05
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 9.55
* ఎస్‌బీఐ – 9.60
* యూకో బ్యాంక్ – 10.05
* బ్యాంక్ ఆఫ్ బరోడా – 10.10
* ఫెడరల్ బ్యాంక్ – 10.49
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – 10.75