అదృష్టవంతుడు ఎవరంటే.. సహజంగా సక్సెస్‌లో వున్నవాళ్లేనని చెప్పేస్తాం. హిట్ వచ్చిన ప్రతి ఒక్కరూ లక్కీ హీరోనే. అయితే.. ఫ్లాప్ వచ్చిన హీరోల్లో కూడా అదృష్టవంతులు వుంటారు. నాలుగు ఫ్లాపుల తర్వాత చేతిలో నాలుగు సినిమాలుంటే.. వాళ్లను లక్కీ అనకుండా ఎలా వుంటాం. వరుసగా నాలుగు ఫ్లాపులు. టచ్ చేసిచూడు.. నేల టిక్కెట్.. అమర్ అక్బర్ ఆంటోని.. డిస్కోరాజా. వీటిల్లో జస్ట్ ఏవరేజ్ మూవీ ఒక్కటీ లేదు. అన్నీ డిజాస్టర్సే. 10 కోట్లు కలెక్ట్ చేయలేదు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలితే ఎవరికైనా.. చేతిలో ఒకటీ అర సినిమాలు వుండడమే గగనం. కానీ.. మాస్‌రాజా ఇందుకు అతీతుడు. ప్రస్తుతం నటిస్తున్న క్రాక్ రిలీజ్ కాకుండానే.. మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు.
అదేమిటోగానీ హిట్ డైరెక్టర్స్ అందరూ.. ఫ్లాప్ హీరో రవితేజా వెనకాల పడ్డారు. క్రాక్ తీస్తున్న గోపీచంద్ మలినేని ఒక్కటే ఫామ్‌లో లేదు. దీని తర్వాత రవితేజాను ఖిలాడీగా చూపిస్తున్న రమేష్ వర్మ బెల్లంకొండతో తీసిన ‘రాక్షసుడు’తో సక్సెస్‌లోకి అడుగుపెట్టాడు. అలాగే.. రామ్‌తో ‘హలోగురు ప్రేమ కోసమే’ తీసిన త్రినాథరావ్ నక్కిన రవితేజాను డైరెక్టర్ చేయనున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ మారుతీకి హిట్ తీసుకొచ్చింది.
ఏడాదిపాటు కథలు రాసుకుంటూ… హీరోలను సెలెక్ట్ చేసుకుంటూ గడిపేశాడు. బన్నీతో కూడా సినిమా ట్రై చేశాడని.. భలే భలే మగాడివోయ్ తర్వాత నానీతో సినిమా ప్లాన్ చేశాడన్న టాక్ నడిచింది. ఎట్టకేలకు మాస్‌రాజా వైపు మొగ్గు చూపాడు మారుతి. చూస్తుంటే వేరే హీరోల కోసం కథలు రాసుకుంటే.. వాళ్లు సెట్ కాక.. రవితేజాతో సరిపెట్టుకుంటున్నారా?. త్రినాథరావు నక్కిన వెంకటేశ్ కోసం చాలాకాలం వర్క్ చేయగా.. రవితేజాతో కమిట్ అయ్యాడు. హిట్ డైరెక్టర్స్ ఎవరికోసం రాసుకున్నా.. రవితేజ రాత బాగుంది.