ఆస్కార్ అవార్డు RRR రావడం ఎంతో గర్వకారణం – మంత్రి తలసాని

-

RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం ఎంతో సంతోషదాయకం అని తెలిపారు తలసాని.

RRR చిత్ర నటులు జూనియర్ NTR, రాంచరణ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, చంద్ర బోస్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు చెప్పారు తలసాని.

ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్ లను అందుకున్న RRR చిత్రం అని వెల్లడించారు. చరిత్రలో మొదటిసారి ఆస్కార్ అవార్డ్ అందుకున్న తెలుగు చిత్రం RRR కావడం ఎంతో గర్వకారణం అని వెల్లడించారు. ఆస్కార్ అవార్డ్ తో విశ్వవ్యాప్తమైన తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news