ఇండియాకు తాలిబన్లు వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి సాహాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్ షాహిన్ హెచ్చరించారు. భారత్ తో తమకు ఎలాంటి శ్రతుత్వం లేదని పేర్కొన్న షాహిన్… కానీ అఫ్ఘాన్ ప్రభుత్వానికి.. సైన్యానికి అండగా ఇండియా తన సైన్యాన్ని తరలిస్తే.. మాత్రం వారికి మంచిది కాదంటూ ప్రకటించాడు. తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోరాదంటూ వార్నింగ్ ఇచ్చాడు.
మరోవైపు భారత్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. తుపాకీ రాజ్యానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. ఇటు భారత ప్రతినిధులతో స్వయంగా ఎలాంటి మీటింగ్ జరిగినట్లు స్పష్టం చేయలేమని చెబుతున్న తాలిబన్ అధికార ప్రతినిధి.. దోహాలో జరిగిన సమావేశంలో మాత్రం భారత ప్రతినిధి బృందం పాల్గొనట్టు తెలిపారు. తమ భూభాగం విషయం ఎవరి జోక్యం అవసరం లేదని హెచ్చరించాడు. ఇప్పటికే టర్కీ లాంటి దేశాలకు వార్నింగ్ ఇచ్చిన తాలిబన్లు.. తాజాగా ఇండియాకు కూడా ఇచ్చారు.