ఈ పూల కోసం 30 కిలోమీటర్లు నడుచుకొని వస్తారట!

-

శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా పువ్వులు. అయితే, విశాఖ నగర వాసులు పూల మార్కెట్‌ కోసం 30 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా వెనుకడడం లేదు. ఎందుకు ఆ పూలు ప్రత్యేకమో ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ మాసంలో పూజలు, శుభకార్యాలు అంటూ సందడిగా ఉంటుంది. ఇక విషయానికి వస్తే పూల మార్కెట్‌ అంటే.. ఆనందపురం పేరే చెబుతారు. ఇక్కడ హోల్‌ సేల్‌ గా పూలమ్ముతారు.


కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మరోవైపు శ్రావణ మాస సందడి రావడం.. మంచి ముహార్తాలు ఎక్కువగా ఉండడం. వీటికి తోడు పూల ధరలు కూడా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నేరుగా రైతులే ఇక్కడికి వచ్చి తమ పూలను విక్రయించుకునే వెసులు బాటు ఉండటంతో నగరవాసులు కూడా ముప్పై కిలోమీటర్లు వెళ్లి మరీ.. ఇక్కడ నుంచే పూలు కొంటున్నారు.

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో ఇళ్లలో ప్రత్యేక పూజలు, ఇతర వ్రతాలను నిర్వహించుకుంటారు.పూల ధరలు మండుతున్నాయి. హోల్‌సేల్‌ పూల మార్కెట్‌లో కిలో కనకాంబరాలు రూ.1000 పలకగా రెండు రోజుల క్రితం అవే పూలు కొన్ని రోజుల కిందట 500 మాత్రమే పలికేవి.

ఇలా ఒక్కోపూలు దాదాపు మూడింతలు, ఐదింతలు పెరిగాయి. శ్రావణ మాసం రెండో వారం.. అందులోనూ పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో పూలకి మంచి గిరాకీ ఉండనుంది. మరో నెలరోజుల పాటు.. ధరలు ఇలాగే ఉంటాయని రైతులు అంటున్నారు. తాజా పూలు అన్ని రకాలు ఒకే దగ్గర దొరుకుతుండడంతో ఉదయాన్నే తొమ్మిదిగంటల లోపే మొత్తం అన్నీ అమ్ముడవుతాయి. దీంతో రైతులకు ఈ సీజన్‌ ఎప్పటి మాదిరి ఈ ఏడాది కూడా మంచి వ్యాపారం చేసుకోవడానికి వీౖలñ ంది.

Read more RELATED
Recommended to you

Latest news