సిక్కిం సీఎం గా తమంగ్.. జూన్ 09న ప్రమాణ స్వీకారోత్సవం..!

-

సిక్కిం క్రాంతికారీ మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ జూన్ 9న రెండోసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్ లోని పాల్గోర్ స్టేడియంలో తమంగ్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి సిక్కింలోని వివిధ ప్రాంతాలతో పాటు ఎస్కేఎం నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో, సిక్కింలోని ఏకైక లోక్సభ స్థానంలో అధికార ఎస్ కేఎంకు భారీ మెజారిటీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమ ఎంపీ అభ్యర్థి ఇంద్ర హంగ్ కేంద్రంతో ఎన్డీయేకు మద్దతిస్తారని చెప్పారు. సిక్కిం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాలకు గానూ 31 స్థానాలను ఎస్కేఎం గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఎస్కేఎం శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. కాగా, ఐదేళ్ల క్రితం కూడా తమంగ్ జూన్ 9నే ప్రమాణ స్వీకారం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news