నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తిరుపతిలో భారీ వర్షం..!

-

దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళతో పాటు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా చేరుకున్నాయి. దీంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

తాజాగా ఏపీలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. దీంతో ఇన్నాళ్లు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్ అవ్వడంతో వర్షం ధాటికి భక్తుల్లోని వృద్ధులు, చిన్నారులు తట్టుకోలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news