పెద్దాపురం వేశ్య పాత్ర‌లో త‌మ‌న్నా?

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీర‌యిన్ కెరీర్ ఆల్ మోస్ట్ ముగిసిపోయింది. అవ‌కాశం రావాలేగానీ ఏ యంగ్ హీరో స‌ర‌స‌న అయిన న‌టించ‌డానిక రెడీగా ఉంది. ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి లో ఓ చిన్న పాత్ర పోషిస్తోంది. అలాగే రెండు త‌మిళ్ సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. ఇటీవేలో ఓంకార్ ఇచ్చిన ఆఫ‌ర్ ను వ‌దులుకుంది. బాలీవుడ్ క్వీన్ రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మిలో న‌టించినా రిలీజ్ కాని ప‌రిస్థితి. సినిమా కొన‌డానికి ఏ డిస్ర్టిబ్యూ ట‌ర్ ముందుకు రాక‌పోవ‌డంతో ల్యాబ్ లోనే మూలుగుతోంది. మ‌హాల‌క్ష్మి హిట్ అయితే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో కొనసాగాల‌ని పెద్ద ప్లాన్ వేసింది కానీ వ‌ర్కౌట్ కాలేదు. ఆదిలోనే హ‌సంపాదు ప‌డటంతో చిన్న చిత‌కా పాత్ర‌లు ఒప్పుకోవాల్సిన స‌న్నివేశం ఏర్ప‌డింది.

Tamannaah Next Movie With Directed Prashanth Varma

ఈ నేప‌థ్యంలో ఓ సంచ‌ల‌న పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకుంద‌ని స‌మాచారం. `అ `సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ప్ర‌శాంత్ వ‌ర్మ ఇటీవ‌లే త‌మ‌న్నాను క‌లిసి ఓ వేశ్య పాత్ర తో కూడిన క‌థ‌ను వినిపించాడుట‌. క‌థ‌..అందులో రోల్ న‌చ్చ‌డంతో వెన‌కాముందు ఆలోచించ‌కుండా ఒప్పేసుకుందిట‌. కొన్ని వాస్త‌వ పాత్ర‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు ఆ క‌థ‌ను సిద్దం చేసుకున్నాడుట‌. క‌థ చాలా వాస్త‌వికంగా ఉంద‌ని….తెర‌పై క‌రెక్ట్ గా ఎ గ్జిక్యూట్ చేయ‌గ‌లిగితే గ‌నుక సినిమా ఓ రేంజ్ లో ఉంటుంద‌ని అంటున్నారు. త‌మ‌న్నాకు ప్ర‌త్యేక‌మైన గుర్తిపు ఖాయ‌మంటున్నారు. ఆ వేశ్య పాత్ర ఎవ‌రిదంటే? ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని పెద్దాపురం ఒక‌ప్పుడు అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా నిలించిన సంగ‌తి తెలిసిందే. క‌డుపు నింపు కోవ‌డం కోసం ఆ ప‌నులే జీవ‌నాధ‌రం.

ముంబై రెడ్ లైట్ ఏరియా త‌ర‌హాలో పెద్దాపురం ఆ ర‌కంగా బాగా వెలుగులోకి వ‌చ్చిన ప్రాంతం. నిత్యం పోలీసుల రైడుల‌తో వార్త‌ల్లో నిలిచేది. అందులో ఓ వేశ్య క‌థ‌ను ఆధారంగా తీసుకుని ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ క‌థ సిద్దం చేసిన‌ట్లు చెబుతున్నారు. ఆమె క‌థ చాలా స్ఫూర్తిగా ఉండ‌టంతోనే ఈ సాహ‌సానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఇలాంటి నేప‌థ్యం గ‌ల స్టోరీలు కొత్తేం కాదు. గ‌తంలో కొన్ని సినిమాలు వ‌చ్చాయి. వ‌రుణ్ సందేశ్ హీరోగా, హ‌రిప్రియ వేశ్య పాత్ర‌లో అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అనే సినిమా తెర‌కెక్కింది. మంచి కంటెట్ అయిన‌ప్ప‌టికీ ఎగ్జిక్యూష‌న్ ఫెయిలైంది. ప్ర‌శాంత్ మంచి మేక‌ర్ కాబ‌ట్టి ఇలాంటి క‌థ‌ల‌ను నెక్స్ట్ లెవ‌ల్లో చూపించ‌గ‌ల‌డు.