కరోనా మహమ్మారి మరో మంత్రిని బలితీసుకుంది..తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను కరోనా బారిపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు..ఈ నెల 13న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డ మంత్రిని..వెంటనే ఆయనను విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..ఆరోగ్యం మరింత మిషమించడంతో మెరుగైన చికిత్సకోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు..72 ఏళ్ల వయసున్న మంత్రి దొరైక్కన్ను కావేరి ఆస్పత్రిలో చేరి గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు..ఆయనకు కరోనాతోపాటు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యుల ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ..ఆరోగ్యం మరింత విషమించడంతో శనివారం రాత్రి 11.15 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు..ఆయన మరణం రాజకీయ, సామాజిక రంగాల్లో కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పళని స్వామి పేర్కొన్నారు…దొరైక్కన్ను అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు..1948లో తంజావూరు జిల్లా రాజగిరిలో దొరైక్కన్ను జన్మించారు. 3 సార్లు పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దొరైక్కన్నుకు భార్య, నలుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.