తమిళ సర్కారు కీలక నిర్ణయం… ఇకపై ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే తమిళ్ కంపల్సరీ..

భాషాభిమానం పేరు చెప్పగానే ఠక్కున గుర్తకు వచ్చే రాష్ట్రం తమిళనాడు. జల్లికట్టు నుంచి తమిళ భాష దాకా ఆ రాష్ట్ర ప్రజల రూటే సపరేటు. తమిళ భాషకు ఎనలేని అభిమానం చూపుతారు అక్కడి ప్రజలు. తమిళ భాష అభివ్రుద్దికి అక్కడి సర్కారు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో వేరే భాష వచ్చినా.. కూడా తమ మదర్ టంగ్ తమిళ్ కే ప్రాధాన్యత ఇస్తుంటారు. తమ భాషకు ఎలాంటి అవమానమైనా.. జరిగితే ఉద్యమాలు చేసిన చరిత్ర తమిళ ప్రజలకు ఉంది. గతంలో బలవంతంగా హిందీ భాషను రుద్దాలని చూసినప్పుడు.. తమిళ భాషాభిమానం ఉవ్వెత్తున ఎగిసి పడింది.

తాజాగా తమిళ భాషకు సంబంధించి తమిళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇకపై తమిళనాడులో తమిళ భాషను కంపల్సరీ చేసింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళ భాషను తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే అందుకు నిర్వహించే అర్హత పరీక్షలోని తమిళ భాషలో కనీసం  40 శాతం మార్కులు పొందడం తప్పని సరి చేస్తున్నట్లు  రాష్ట్ర ఆర్థిక మంత్రి తయగ రాజన్ చెప్పారు.