కమలా హ్యారిస్ విజయం.. పండుగలా జరపుతున్న తమిళులు !

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి యావత్ ప్రపంచానికే కాదు తమిళనాడులోని రెండు గ్రామాలకు అయితే మరింత ప్రత్యేకంగా నిలిచాయి. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కమల హ్యారీష్ అమెరికాకి తొట్ట తొలి మహిళా అధ్యక్షురాలు ఎన్నిక కావడమే దానికి కారణం. భారత సంతతికి చెందిన కమల అమ్మమ్మ తాతయ్యల స్వగ్రామాలిన తమిళనాడులోని తుళసేంద్రపురం, పైంగానాడు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా లో ఉన్న ఈ గ్రామాల్లో ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. కమలా హ్యారిస్ తాతగారైన పివి గోపాలన్ స్వస్థలం తుళసేంద్రపురం కాగా అమ్మమ్మ రాజం అక్కడి పైంగానాడు వాసి. భారత దౌత్య వేత్తగా బాధ్యతలు నిర్వర్తించిన గోపాలన్ కూతురు అయిన శ్యామల కూతురే ఈ కమలా హ్యారిస్. తమ ఆడబిడ్డ గెలవడంతో ఆ రెండు గ్రామాల ప్రజలు దీపావళికి ముందే పండుగ చేసుకుంటూ టపాసులు పేలుస్తున్నారు. అలానే అగ్రరాజ్య ఉపాధ్యక్ష్యురాలు కమలా హారిస్ తమ ఊరి బిడ్డ అని సగర్వంగా చాటుకుంటున్నారు.