ఏపీలో 26,431 పోలీస్ పోస్టులు భర్తీ చేస్తాం – ఏపీ హోం మంత్రి

-

పోలీస్‌ శాఖలో మొత్తం 26,431 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు ఏపీ హోం మంత్రి తానేటి వనిత. తొలి దశలో 6500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఏదైనా ఘటన జరిగితే అందులో నిజానిజాలు బయటికి రావాలి అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అవసరమని.. గతం లో నమూనాలను తిరుపతికి పంపేవారని తెలిపారు.

అనంతపురం, సత్యసాయి జిల్లా లో త్వరితగతిన కేసులు చేదిచెందుకు ఇది దోహదపడుతుంది… ముఖ్యమంత్రి అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని స్పష్టం చేశారు. జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తూ కేసులు త్వరితగతిన నమోదు చేస్తున్నారని.. గతం లో పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది గా ఉండేదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పోలీసు సేవలు మెరుగు పరిచారని.. దిశా యాప్, ల్యాబ్ ల ఏర్పాటు వంటి వాటితో త్వరితగతిన సేవలు పొందే అవాశముందని పేర్కొన్నారు. టెక్నాలజీ ని ఉపయోగించుకొని పోలీసు శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version