నందమూరి తారకరత్న కుప్పం లో లోకేష్ పాదయాత్రలో భాగంగా పాల్గొని అక్కడికక్కడే కుప్పకూలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించగా.. ప్రస్తుతం అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఆయన చికిత్సకు సహకరిస్తున్నప్పటికీ బ్రెయిన్ లో డామేజ్ ఏర్పడిందనే వార్త బయటకు వచ్చింది.. సాధారణంగా గుండె ఆగినప్పుడు బ్రెయిన్ కి రక్తం సరఫరా ఆగిపోయి.. బ్రెయిన్ డ్యామేజీ ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు బ్రెయిన్ డామేజ్ తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని కూడా చెబుతున్నారు డాక్టర్ రమాదేవి..
గుండెపోటు సమయంలో సీపీఆర్ చేసే సమయాన్ని బట్టి శరీరంలో మిగిలిన ఆర్గాన్స్ పనితీరు ఉంటుందని.. గుండె ఆగిపోయిన నాలుగు నిమిషాల్లోనే సీపీఆర్ చేస్తే ప్రమాదం తక్కువగా ఉంటుందని.. ఎల్లప్పుడూ డాక్టర్ అందుబాటులో ఉండడు కాబట్టి ప్రతి ఒక్కరు సీపీఆర్ నేర్చుకోవాలని ఆమె చెప్పింది. తారకరత్నకు కూడా గుండె ఆగిపోయిన వెంటనే సీపీఆర్ అందించారు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా చికిత్సకి సహకరిస్తున్నారని… కానీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఆమె స్పష్టం చేశారు. నిజానికి గుండె ఆగినప్పుడే కాకుండా బ్రెయిన్ కి రక్తం సరఫరాగినప్పుడు కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అంటే బ్లడ్ క్లాట్స్ వంటి వాటి వల్ల ఇలా జరగవచ్చు.
ఇది రక్తం నుండి సరఫరా అయ్యే ఆక్సిజన్ అందకపోయినా బ్రెయిన్ డామేజ్ జరగవచ్చు అంటూ డాక్టర్ రమాదేవి తారకరత్న ఆరోగ్య విషయంపై కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అని స్వతహాగా ఊపిరి తీసుకోగలిగినప్పుడు వెంటిలేటర్ చికిత్స ఆపేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.