టార్గెట్ 78: కాంగ్రెస్ పక్కా లెక్క..!

-

తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నానా రకాలుగా కష్టపడుతున్న విషయం తెలిసిందే…ఇప్పటికే టీఆర్ఎస్ చేతుల్లో రెండుసార్లు చావుదెబ్బ తిన్న కాంగ్రెస్…మూడో సారైనా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంది. అయితే మూడోసారి కూడా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడం అనేది కాంగ్రెస్‌కు కష్టమైన విషయమే అని తెలుస్తోంది..పైగా మరో వైపు బీజేపీ కూడా దూకుడుగా ఉంది..ఇలాంటి పరిస్తితుల్లో కాంగ్రెస్ గెలుపు అనేది చాలా కష్టమైన పని. అయినా సరే ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పనిచేస్తుంది. పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది.

congress
congress

పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక రేవంత్ దూకుడుగానే పనిచేశారు…కానీ మధ్యలో కాస్త వెనక్కి తగ్గారు…మళ్ళీ ఇప్పుడు రేవంత్ దూకుడు పెంచారు. వరుసపెట్టి ప్రజా సమస్యలపై సభలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇప్పటికే పరిగిలో భారీ సభ ఏర్పాటు చేసి…టీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అలాగే నిరుద్యోగుల సమస్యలపై కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.

ఈ క్రమంలోనే రేవంత్ ఇప్పుడే ఎన్నికల హామీలు కూడా ఇచ్చేస్తున్నారు.. ఉద్యోగాలు భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించి 8 ఏళ్లయినా, ఇంత వరకు భర్తీ చేయలేదని, రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ ఇటీవల బిశ్వాల్‌ కమిటీ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అలాగే తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం చేతకాక.. కేసీఆర్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను తెచ్చుకుంటున్నారని రేవంత్‌ అన్నారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 78 సీట్లలో గెలుపొంది అధికారం చేపట్టబోతుందని పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ధీమా వ్యక్తం చేశారు. మరి 78 సీట్ల విషయంలో కాంగ్రెస్ లెక్క ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు…కానీ పక్కాగా 78 సీట్లు గెలుస్తామని అంటున్నారు. మరి ఈ పక్కా లెక్కలో ఉన్న కాంగ్రెస్ ధీమా ఏంటో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news