బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్… ఇక ఆ చార్జెస్ వుండవు..!

-

బ్యాంక్ కస్టమర్స్ కి శుభవార్త. తాజాగా టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంక్ ఖాతాదారులకు రిలీఫ్ కలగనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ యూఎస్ఎస్‌డీ బేస్డ్ మొబైల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ సర్వీసులకు టారిఫ్‌ ధరలు తొలగించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

banks
banks

ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకోవడం తో బ్యాంక్ కస్టమర్లకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది. యూఎస్ఎస్‌డీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ సర్వీసులకు చార్జీలు యాభై పైసలు వుంది. అయితే ఫీచర్ ఫోన్ యూజర్లు లక్ష్యంగా ట్రాయ్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇది ఇలా ఉంటే డిజిటల్ ఫైనాన్షియల్ సేవల్లో మరింత మంది భాగస్వామ్యానికి కూడా ఈ నిర్ణయం కాస్త హెల్ప్ అవుతుంది అని చెప్పచ్చు. అదే విధంగా ట్రాయ్ తాజాగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా జరిగింది.

పరిశ్రమ వర్గాలు డిసెంబర్ 8 వరకు ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు, సూచనలు పంపొచ్చు. ఇవన్నీ పరిశీలించిన తరవాత ఫైనల్ గా ట్రాయ్ ఈ నిర్ణయంని అమలు చేయనుంది అని క్లియర్ గా తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news