హైదరాబాద్ తార్నాకలో నివాసముంటున్న విజయ్‌ప్రతాప్(33), సింధూర(32), వారి కుమార్తె ఆద్య(4), విజయ్ తల్లి జయంతి(65) ఆదివారం రోజున ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వారి మరణం పలు అనుమానాలకు తావిస్తోందని భావిస్తున్నట్టు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి/సోమవారం తెల్లవారుజామున భార్య, కుమార్తె, తల్లిని విద్యుత్ తీగ (కరెంట్‌వైర్)తో గొంతు బిగించి చంపి అనంతరం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. భర్త విజయ్ చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా.. భార్య సింధూర హైదరాబాద్‌లో ఓ బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. వృత్తిరీత్యా ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉండగా.. విజయ్‌కు ఇటీవలే ఉద్యోగంలో పెద్ద హోదా లభించడంతో.. కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ కావాలని కోరాడు. ఈ క్రమంలో తరచూ ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండేవారు.
ఆదివారం రాత్రి కూడా ఇదే విషయంలో గొడవపడ్డారు. మరుసటి రోజు విజయ్ ఫ్రెండ్.. విజయ్‌కు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్లింటికి వెళ్లాడు. ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ విజయ్.. సింధూర, ఆద్య, జయతి కింద పరుపుపై విగతజీవులై కనిపించారు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు.