ఫార్మ్‌ హౌజ్‌ వీడియోలపై ప్రమాణం చేయాలి – కేసీఆర్‌కు తరుణ్‌ చుగ్‌ సవాల్‌

-

సీఎం కేసీఆర్‌ రిలీజ్‌ చేసిన ఫాం హైజ్‌ వీడియోలకు మాకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ నేత తరుణ్‌ చుగ్‌ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే గుడిలో బండి సంజయ్ ప్రమాణం చేశారని.. సీఎం కేసీఆర్ అబద్ధం చెప్తున్నారని ఆగ్రహించారు. ఒక్క ఎమ్మెల్యే ను కొనేందుకు కూడా మేం డబ్బు ఖర్చు పెట్టలేదని తేల్చి చెప్పారు తరుణ్‌ చుగ్‌.

ప్రధాని మోడీ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని.. ప్రధాని చేసిన అభివృద్ధిపై ఎక్కడయినా చర్చించేందుకు మేం సిద్ధమన్నారు. మీరు చేసింది చెప్పడానికి ఏమయినా ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు ప్రజలు బై బై చెప్తారని… ఇలాంటి ముఖ్యమంత్రి ని మొదటి సారి చూస్తున్నామన్నారు బీజేపీ నేత తరుణ్‌ చుగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news