వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ఎంత తాపత్రయ పడుతున్నారో తెలిసిందే…ఈ సారి గాని అధికారం దక్కించుకోకపోతే టీడీపీ పని ఏం అవుతుందో కూడా బాబుకు బాగా తెలుసు…జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుంది…అందుకే ఈ సారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బాబు కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు…ఇప్పటికే జిల్లాల పర్యటన కూడా మొదలుపెట్టారు…మినీ మహానాడు, రోడ్ షోలతో జనంలో ఉంటున్నారు.
అలాగే తమ నేతలని కూడా జనం మధ్యలోనే ఉండమంటున్నారు…జనంలో ఉంటూ ప్రజా మద్ధతు ఉన్నవారికే సీట్లు కూడా ఇస్తానని అంటున్నారు. అయితే టీడీపీ నేతలు కూడా మునుపటి కంటే ఇప్పుడు యాక్టివ్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టారు. కాకపోతే కొందరు తమ్ముళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు…చంద్రబాబుకే మస్కా కొడుతూ…ప్రజల్లో ఉండమంటే…మీడియా ముందు ఎక్కువ ఉంటున్నారు. అది కూడా టీడీపే అనుకూల మీడియా ముందు ఎక్కువ కనబడుతున్నారు.
అసలు మీడియాలో తాము కనిపిస్తే చాలు…లేదా తాము మాట్లాడిన మాటలు స్క్రోలింగ్ లో కనబడితే చాలు…అది బాబుకు రీచ్ అవుతుందని, అలాగే చంద్రబాబు దృష్టిలో పడతామని భావిస్తున్నారు. అంటే పూర్తిగా మీడియా లో కనిపిస్తే చాలు..ప్రజల్లో ఉన్నట్లే అని ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు ఏదొక రకంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. ఇలా చేసి బాబుకే మస్కా కొడదామని అనుకుంటున్నారు.
కానీ బాబు ఇంకా తెలివిగా ఉంటున్నారు..నేతల పనితీరుని గమనిస్తున్నానని..ఎవరు ఎంతసేపు ప్రజల్లో ఉంటున్నారో చూస్తున్నాన్నని, అందరి రిపోర్ట్స్ తన దగ్గర ఉన్నాయని అంటున్నారు. దీంతో మీడియాలో హడావిడి చేస్తున్న కొందరు తమ్ముల్లాకు కష్టాలు మొదలయ్యాయి..ఇకనుంచైనా ప్రజల్లో తిరగాలని చూస్తున్నారు. అలా చేయకపోతే నెక్స్ట్ సీటు కూడా దక్కదనే అనుమానం తమ్ముళ్లలో వస్తుంది. మొత్తానికి బాబుకు మస్కా కొట్టడం అంత ఈజీ కాదనే చెప్పొచ్చు.