ఏపీ అసెంబ్లీ కి సమీపంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. ఇసుక కొరత అంశం మీద టీడీపీ ధర్నా జరిగినట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ పనిముట్లతో టీడీపీ ప్రజాప్రతినిధులు అందరూ నిరసనకు దిగారు. చంద్రబాబు మీద ఉన్న ఇసుక పాలసీ రద్దు చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు శాసనసభ పక్ష నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భవన నిర్మాణ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలే అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో పులివెందల బ్యాచ్ని ప్రభుత్వం నింపిందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు ఇప్పటిదాకా ఐదు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని ఆయన అన్నారు ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని మంత్రులే చెబుతున్నారని ఆయన అన్నారు.ఇక మొదటి రెండు రోజులు ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ జరగగా ఈరోజు ఏమవుతుందో ? చూడాలి మరి.