తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ మొదలైన సందర్భంగా ఇంకా తెలుగు దేశం తొమ్మిది మందితో తమ తొలి జాబితాను ప్రకటించింది. మహాకూటమిలో భాగంగా టీడీపీకి 14 సీట్లు కేటాయించగా దీంతో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇక మిగతా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలో తెదేపా సీనియర్లకే ప్రాధాన్యత ఇచ్చింది.
ఖమ్మం నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నేత నామా నాగేశ్వరరావు బరిలో నిలుస్తుండగా, సుత్తుపల్లి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మరోసారి అవకాశం దక్కింది. ఉప్పల్ నుంచి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ దక్కించుకున్నారు.
తెదేపా తొలి జాబితాలోని అభ్యర్థులు..
ఖమ్మం- నామా నాగేశ్వర రావు
సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య
అశ్వారావు పేట- మచ్చ నాగేశ్వర రావు
వరంగల్ పశ్చిమ- రేవూరి ప్రకాశ్ రెడ్డి
మక్తల్- కొత్తకోట దయాకర్ రెడ్డి
మహబూబ్ నగర్- ఎర్ర శేఖర్
ఉప్పల్- వీరేందర్ గౌడ్
శేరిలింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్
మలక్‌పేట- ముజఫర్