ఏపీ ఆర్థిక శాఖ పై టీడీపీది శ్వేతపత్రం కాదు.. సాకుల పత్రం : మాజీ మంత్రి బుగ్గన

-

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. గత ప్రభుత్వానికి సంబంధించిన పలు శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు. తాజాగా ఏపీ ఆర్థిక పరిస్తితి పై అసెంబ్లీలో సీఎం శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు బయటపెట్టారు.

దీనిపై మాజీ మంత్రి బుగ్గన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టింది శ్వేత ప్రతంలా లేదని.. సాకు పత్రంగా కనిపిస్తుందని విమర్శించారు. సభలో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ సాకులే అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. టీడీపీ హయాంలోనే అప్పు 21.63 శాతం పెరిగిందని.. వైసీపీ పాలనలో గత ఐదేళ్లలో 12.9 శాతం మాత్రమే పెరిగిందని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం మ్యాచ్ ప్రారంభ మొదటి ఓవర్ లోనే కూటమి సూపర్ సిక్స్ డకౌట్ అయిందన్నారు. ఏపీ అప్పులపై కేంద్రం ఎప్పుడో క్లారిటీ ఇచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version