నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం !

-

తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. రానున్న ఆరు నెలల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఏడాదిలోగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

శుక్రవారం అగ్నిమాపక శాఖలో నేరుగా రిక్రూట్ అయిన ఫైర్‌మెన్‌ల నాలుగో బ్యాచ్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా రిక్రూట్ అయిన ఫైర్‌మెన్‌లకు అభినందనలు తెలిపారు. శిక్షణ కాలంలో వారి కృషి, అంకితభావాన్ని మెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువత ఆకాంక్షలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఎత్తిచూపారు. కొన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షలను వాయిదా వేయాలని పిలుపునిస్తూ ఇటీవలి నిరసనలకు దిగిన వారిని ఉద్దేశిస్తూ.. యువత నిరసనలు చేయవద్దని, వారి సమస్యలపై నేరుగా మంత్రులతో చర్చించాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వాస్తవ సమస్యలను నిబద్ధతతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version