బ్రేకింగ్ : టీడీపీ నేత నారా లోకేష్ అరెస్ట్‌

గుంటూరు : గుంటూరు GGH వద్ద రమ్యశ్రీ కుటుంబాన్ని పరమర్శించడానికి వచ్చిన, నారా లోకేష్‌ మరియు ధూళిపాళ్ల మీద దాడికి యత్నించారు వైకాపా నాయకులు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్‌ మరియు ధూళిపాళ్లను అరెస్ట్ చేసారు పోలీసులు. దీంతో గుంటూరు జీజీఎహెచ్‌ వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తతంగా మారిపోయింది. ఇక అరెస్ట్‌ అయిన నారా లోకేష్‌ ను పత్తిపాడు పోలిసు స్టేషను కు తరలించారు పోలీసులు.

అయితే.. ఈ ఘటనపై నారా చంద్రబాబు సీరియస్‌ అయ్యారు…పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలపై పోలీసుల దౌర్జన్యమా? హత్యకు గురైన దళిత విధ్యార్ధిని రమ్యకు రూ. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవండంలో జగన్ ప్రతాపం చూపించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే గుంటూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన దళిత విధ్యార్దిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర గార్లపై పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉందన్నారు.