నాడు-నేడు రెండో విడతకు శ్రీకారం

ఇవాళ తూ. గో జిల్లాలో పర్యటించిన సీఎం జగన్‌… పి. గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ ను సందర్శించి…అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ఆల్‌ ద వెరీ బెస్ట్‌ అని రాసి విద్యార్థులను విషేష్‌ చెప్పారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్‌ విద్యార్థులతో మాట్లాడుతూ.. పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను సీఎం జగన్‌ కు వివరించారు.

ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మనబడి నాడు-నేడు ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్‌ ఆవిష్కరించి సీఎం జగన్‌ ప్రారంభించారు. మనబడి నాడు-నేడు ద్వారా తొలి విడత కింద రూ. 3669 కోట్లతో 15715 ప్రభుత్వ సూళ్లను ఆధునీకరించారు. ఇక ఇవాళ్టి నుంచి పాఠశాలలు పున ః ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు జగన్‌ శ్రీకారం చుట్టారు. అలాగే… జగనన్న విద్యా కానుక పంపిణీని రూ. 731.30 కోట్లతో జగన్‌ ప్రారంభించారు.